Webdunia - Bharat's app for daily news and videos

Install App

WTC Final కంటే ముందే భారత్‌పై కివీస్ ఆధిపత్యం.. ఎలాగంటే?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (17:04 IST)
అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) ప్రకటించిన టెస్ట్​ ర్యాంకింగ్స్​ల్లో న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్​తో జరిగిన సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం… కివీస్​ 123 పాయింట్లతో జాబితాలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. దీంతో WTC Final కన్నా ముందే న్యూజిలాండ్ టీమిండియాపై ఆధిపత్యం సాధించినట్లైంది. 
 
విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా  121 పాయింట్లతో రెండో స్థానానికి జారిపోయింది. గత కొంత కాలంగా అగ్రస్థానంను కొనసాగిస్తున్న టీమిండియా తాజాగా ప్రకటించిన  ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి పడిపోయింది. కేవలం రెండు పాయింట్లతో మాత్రమే న్యూజిలాండ్ జట్టు ముందుకు దూసుకుపోయింది.
 
ఇక 108 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉండగా.. గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 4వ స్థానంలోకి పడిపోయింది. 94 పాయింట్లతో 5వ‌ స్థానంలో పాకిస్థాన్ ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి.
 
ఇక ఇంగ్లాండ్​ గడ్డపై 22 ఏళ్ల తర్వాత సిరీస్​ విజయాన్ని అందుకుంది కివీస్. చివరగా 1999లో టెస్ట్​ సిరీస్​ను గెలుపొందింది న్యూజిలాండ్. ఈ విజయంతో.. ఇక ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్​షిప్ ఫైనల్​కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
 
ఇకపోతే.. పంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న WTC Final‌కి కౌంట్ డౌన్ షూరు అయింది. మరో ఐదు రోజుల్లో మెగా ట్రోఫి కోసం టీమిండియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇప్పటికే, ఈ ట్రోఫి కోసం ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. న్యూజిలాండ్ ఇంగ్లండ్ పై సిరీస్ నెగ్గి.. ఈ మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటే..ఇంట్రా స్వ్యాడ్ మ్యాచ్ లాడుతూ టీమిండియా కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
 
ఇంతలో ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కునెట్టిన న్యూజిలాండ్ నెంబర్‌వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 1-0తో గెలవడంతో కివీస్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

గుజరాత్- మహిళ బట్టలు విప్పి, దాడి చేసి, మోటార్ సైకిల్ చక్రానికి కట్టి ఈడ్చుకెళ్లారు..

ఫిబ్రవరి 2న జనంలోకి జనసేన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం

రాత్రికి రాత్రే అంతా మారిపోదు.. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్.. చంద్రబాబు

హైదరాబాద్‌లో రక్తదాన శిబిరాలను నిర్వహించిన కిస్నా డైమండ్ జ్యువెలరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తర్వాతి కథనం
Show comments