ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌కు భారీ షాక్ తగిలింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకుగానూ భారత్‌లో ఉన్న చట్టపరమైన రక్షణ (మధ్యవర్తి హోదా)ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. నూతన నిబంధనల ప్రకారం.. కొందరు కీలక అధికారులను ట్విట్టర్ నియమించాల్సి వున్నప్పటికీ.. ఆ సంస్థ ఆ పని చేయడంలో విఫలమైనందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
నూతన నిబంధనల ప్రకారం.. కొందరు కీలక అధికారులను ట్విటర్ నియమించాల్సి ఉన్నా.. ఆ సంస్థ ఆ పని చేయడంలో విఫలమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో యూజర్లు అభ్యంతరకర పోస్టులకు ఇకపై ట్విట్టర్ కూడా క్రిమినల్ కేసులు, ఇతరత్రా చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. మధ్యవర్తి హోదా ఎత్తివేసిన వెంటనే ఉత్తరప్రదేశ్‌లో ట్విటర్‌పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం.
మతపరమైన హింసను ప్రోత్సహించే ట్వీట్ల కారణంగా ఆ సంస్థపై ఈ కేసు పెట్టారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్‌పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి.