Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్.. శ్రీలంక కోసం.. .

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్.. శ్రీలంక కోసం.. .
, మంగళవారం, 15 జూన్ 2021 (15:39 IST)
భారత క్రికెట్ జట్టులో మిస్టర్ వాల్‌గా ఖ్యాతిగడించిన మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఎంపిక చేశారు. శ్రీలంక పర్యటనకు వెళ్లే శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియాకు ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 
 
జులైలో శ్రీలంకతో జరగనున్న పరమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఇటీవలే టీమ్‌ను కూడా బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆ టీమ్‌కు ద్రావిడ్ కోచ్‌గా ఉంటారని ఎన్నెన్నో ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటినీ నిర్ధారిస్తూ రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడని ఓ వార్తా సంస్థతో గంగూలీ వ్యాఖ్యానించాడు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్‌లు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టెస్ట్ టీమ్‌కు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో శ్రీలంకతో తలపడే టీమ్‌కు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా ఉంటాడని జై షా వెల్లడించారు. ఈ జట్టు సోమవారం నుంచి వారం పాటు జట్టు సభ్యులను కఠినమైన క్వారంటైన్‌లో ఉంచినట్టు చెప్పాడు.
 
కాగా, జులై 13 నుంచి శ్రీలంకతో జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం ఈ నెల 28న టీమిండియా ఆటగాళ్లు కొలంబో వెళ్లనున్నారు. అక్కడ జులై 4 వరకు మరోమారు క్వారంటైన్ కానున్నారు. ఆ తర్వాత ఆటగాళ్లంతా రెండు వేర్వేరు జట్లుగా ఏర్పడి ప్రాక్టీసు మ్యాచ్‌లు ఆడుతారు. జులై 13, 16, 18న వన్డే మ్యాచ్‌లు, 21, 23, 25వ తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

WTC ఫైనల్: చెమటోడుస్తున్న కోహ్లీ.. నెట్ ప్రాక్టీస్‌లో బిజీ