Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంక జట్టుకు షాక్.. అత్యాచారం కేసులో క్రికెటర్ గుణతిల అరెస్టు

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (13:46 IST)
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాలుపంచుకుంటున్న శ్రీలంక జట్టుకు తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు క్రికెటర్‌ ఓపెనింగ్ బ్యాటర్ ధనుష్క గుణతిలను అత్యాచారం కేసులో పోలీసులు అరెస్టు చేశారు. గాయం కారణంగా మధ్యలోనే జట్టు సేవలకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన జట్టుతో కలిసి ఆయన  స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. 
 
తనపై గుణతిల అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిడ్నీ పోలీసులు స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న గుణతిలను ఆదివారం ఉదయం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో శ్రీలంక జట్టు గుణతిల లేకుండా స్వదేశానికి బయలుదేరింది. 
 
ఈ టోర్నీలో శ్రీలంక జట్టు నమీబియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సభ్యుడిగా గుణతిల ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో గాయపడిన గుణతలి... ప్రత్యామ్నాయ ఆటగాడు జట్టులో చేరేంత వరకు జట్టుతోనే కలిసివుండాలని లంక క్రికెట్ బోర్డు కోరడంతో ఆస్ట్రేలియాలో ఉండిపోయాడు. 
 
ఈ క్రమంలో స్థానిక యువతిపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు రావడంతో సిడ్నీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వందకు పైగా మ్యాచ్‌లు ఆడిన గుణతిల గతంలోనూ ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్నారు. స్వదేశంలో ఓ నార్వే యువతిని గుణతిలతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ కేసు నుంచి గుణతిల బయటపడ్డాడు. కానీ ఇపుడు ఆస్ట్రేలియాలో చిక్కుకున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments