Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ క్రికెటర్లకు అరుదైన ఛాన్స్.. నేటి నుంచి జింబాబ్వేతో టీ20 క్రికెట్ సిరీస్!!

సెల్వి
శనివారం, 6 జులై 2024 (09:39 IST)
యువ క్రికెటర్లకు అరుదైన ఛాన్స్ దక్కింది. జింబాబ్వే క్రికెట్‌ జట్టుతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచిన విషయం తెల్సిందే. ఇపుడు కుర్రాళ్ళతో నిండినచ యువ క్రికెట్ జట్టు జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో తలపడనుంది. 
 
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. టీ20 ఫార్మాట్‌కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి మ్యాచ్ కావడంతో జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. అయితే మ్యాచ్‌కు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ప్రీ-మ్యాచ్ విలేకరుల సమావేశంలో కెప్టెన్ శుభమాన్ గిల్ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు.
 
ఈ యేడాది ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు అభిషేక్ శర్మ కెరీర్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడని ప్రకటించాడు. అభిషేక్ శర్మ, తాను ఓపెనర్లుగా రాబోతున్నట్టు వెల్లడించాడు. మొదటి రెండు మ్యాచ్‌కు యశస్వి జైస్వాల్ అందుబాటులో లేకపోవడంతో అభిషేక్‌కు ఓపెనర్ అవకాశం దక్కిందని వివరించాడు. కాగా, ఐపీఎల్ 2024లో అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి, 204.21 స్ట్రైక్ రేట్‌తో 500కి పైగా పరుగులు చేశాడు. రుతురాజ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని చెప్పాడు. 
 
గతంలో టీ20లలో తాను ఓపెనర్‌గా బరిలోకి దిగానని, ఇపుడు మరోమారు బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్టు గిల్ చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో తమను పోల్చలేమని, అయితే ప్రతి క్రికెటర్‌కు తన స్వంత లక్ష్యం ఉంటుందన్నాడు. ఒత్తిడి, అంచనాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని గిల్ పేర్కొన్నాడు. 
 
ఇరు జట్ల అంచనా... 
భారత్ : శుభమన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేశ్ కుమార్.
 
జింబాబ్వే : బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ క్యాంప్బెల్, అంటుమ్ నఖ్వీ, క్లైవ్ మదాండే (వికెట్ కీపర్), వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, పరాజ్ అకమ్. వెలింగ్టన్ మసకదా. బెస్సింగ్ ముజరబానీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

తర్వాతి కథనం
Show comments