Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో క్రికెట్ జాతర.. వీధుల్లో ఇసుకపడితే కూడా.. వరల్డ్ కప్‌తో పరేడ్ (వీడియో)

T20 World Cup Victory

సెల్వి

, గురువారం, 4 జులై 2024 (22:24 IST)
T20 World Cup Victory
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో క్రికెట్ జాత‌ర జరిగింది. ఇసుకపడితే కూడా రాలనంతగా క్రికెట్ అభిమానులు ముంబై వీధుల్లో నిలిచిపోయారు. గ‌తంలో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భార‌త‌ జట్టు ఓపెన్ బస్ రోడ్ షో జరిగింది. 
 
మ‌రోసారి అదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ క్రికెట్ అభిమానులను చూస్తే నెటిజన్లు షాకయ్యారు. వామ్మో ఇంత జనమా.. అంటూ నోరెళ్లబెట్టారు. ఆ జనాన్ని చూసి జడుసుకున్నారు. 
 
17 ఏళ్ల తర్వాత మ‌రోసారి అద్భుత‌మైన క్ష‌ణాలు ముంబైలో క‌నిపించాయి. ఓపెన్ బ‌స్ పరేడ్ షో తో పాటు వాంఖడేలో టీమిండియా విజ‌య సంబరాలు జ‌రుగుతున్నాయి. స్టేడియంలోకి అంద‌రికి ఉచిత ఎంట్రీ ఉంది. ప్ర‌స్తుతం ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురుస్తున్న అభిమానులు లెక్క‌చేయ‌కుండా టీమిండియా విజ‌య‌యాత్ర‌లో పాలుపంచుకుంటున్నారు. 
 
రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ప్రపంచకప్‌లో టీమిండియా అజేయంగా వ‌రుస‌గా 8 మ్యాచ్‌ల‌ను గెలిచి చ‌రిత్ర సృష్టించింది. ఈ క్ర‌మంలోనే సాగుతున్న టీమిండియా ఓపెన్ బ‌స్ పరేడ్‌లో క్రికెటర్లు పాల్గొన్నారు. వీరికి అడుగడుగునా క్రికెట్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. 
 
అంతకుముందు టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీ గెలిచిన భారత జట్టు గురువారం ఉద‌యం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక ముంబైకి చేరుకున్న ఈ ప్రపంచకప్ విజయోత్సవ ర్యాలీలో వరల్డ్ కప్ విన్నర్స్ ఓపెన్ టాప్ బస్సులో నిల్చుని రోడ్ షోలో సందడి చేశారు. 
 
నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగిన ఈ రోడ్ షోలో టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీతో అభిమానులను అభివాదం చూస్తే ముందుకు సాగారు. ప్రస్తుతం టీమిండియా వాంఖడే చేరింది. 
webdunia
T20 World Cup Victory
 
అక్కడ బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ.125 కోట్ల నగదు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ స్టేడియంలోనికి ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియం అభిమానులతో కిటకిటలాడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ - రోహిత్ స్థానాలను భర్తీ చేసే యువ క్రికెటర్లు ఎవరు?