Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ - రోహిత్ స్థానాలను భర్తీ చేసే యువ క్రికెటర్లు ఎవరు?

Advertiesment
rohit - kohli

వరుణ్

, గురువారం, 4 జులై 2024 (18:18 IST)
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ మెగా ఈవెంట్ తర్వాత భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశారు. అయితే, ఇపుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల స్థానాలను భర్తీ చేసే యువ క్రికెటర్లు ఎవరన్న దానిపై ముమ్మరంగా చర్చ సాగుతుంది. ఇదే అంశంపై వివిధ రకాలైన పోల్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సంస్థ నిర్వహించిన ఓటింగ్‌లో ఊహించిన ఫలితాలు వచ్చాయి. అయితే, మూడో స్థానం కోసం మాత్రం హోరాహోరీ పోటీ తప్పలేదు. 
 
భారత క్రికెట్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వారసత్వాన్ని శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ ముందుకు నడిపిస్తారని పాఠకులు అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తర్వాత ఎవరు అనేది తెలిపే మూడో స్థానం కోసం కేఎల్‌ రాహుల్‌, అభిషేక్‌ శర్మ మధ్య నువ్వా నేనా అనేలా పోటీ నడిచింది. ఆఖరికి యువ ఓపెనర్‌ అభిషేక్‌కే మూడో స్థానం దక్కింది. 
 
కాగా, ఈ పోలింగ్‌లో యశస్వి జైస్వాల్‌ - 66.7 శాతం, శుభ్‌మన్‌ గిల్‌ - 58.3, అభిషేక్‌ శర్మ - 24.7, కేఎల్‌ రాహుల్‌ - 21.7, రుతురాజ్‌ గైక్వాడ్‌ - 17.9, ఇషాన్‌ కిషన్‌ - 5.5, సాయి సుదర్శన్‌ - 4.1, దేవదత్‌ పడిక్కల్‌ - 1 చొప్పున ఓట్లు పోలయ్యాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ20 ప్రపంచ కప్ విజయోత్సవ ఊరేగింపునకు ముంబై సిద్ధం