Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

Ridhima

సెల్వి

, శనివారం, 1 జూన్ 2024 (17:36 IST)
Ridhima
బాలీవుడ్ సీరియల్ నటి రిధిమా పండిట్‌ను టీమిండియా యువ‌ క్రికెటర్ శుభ్‌మ‌న్ గిల్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరుగనుందని టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రూమర్ల‌పై నటి రిధిమా స్పందించారు. 
 
తాను పెళ్లి చేసుకోవట్లేదని.. జర్నలిస్టుల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయని.. తన జీవితంలో జరిగే కీలక ఘట్టం పెళ్లి.. అదేదో ఫిక్స్ అయితే కచ్చితంగా అనౌన్స్ చేస్తానని రిధిమా తెలిపింది. 
 
ఈ రూమ‌ర్స్‌లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఇక రిధిమా పండిట్ న‌టన విష‌యానికి వ‌స్తే.. టీవీ న‌టి అయిన రిధిమా 'బహు హుమారీ రజనీ కాంత్ ఫేమ్' అనే సీరియ‌ల్‌తో బాగా పాప్యుల‌ర్‌ అయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల