చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు బుధవారం రూ. 12 లక్షల జరిమానా విధించారు. "మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో, గిల్‌కి రూ. 12 లక్షల జరిమానా విధించబడింది.
ఈ టోర్నమెంట్‌లో గిల్ నేతృత్వంలోని జట్టు మంగళవారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో 63 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలిసారిగా ఐపీఎల్ ఫ్రాంచైజీకి నాయకత్వం వహిస్తున్న గిల్ గుజరాత్ టైటాన్స్ తమ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.