Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాకు ఆడనున్న అర్జున్ టెండూల్కర్

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (15:49 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇకపై గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. 21 ఏళ్ల సచిన్ తనయుడు 2020-21 సీజన్‌లో ముస్తాక్ అలీ టోర్నీలో ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు. 
 
ఆ టోర్నీలో రెండంటే రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నప్పటికీ మైదానంలో దిగే అవకాశం లభించలేదు.
 
ఈ నేపథ్యంలో ముంబైకి గుడ్‌బై చెప్పేసి గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నట్టు అర్జున్ టెండూల్కర్ ప్రతినిధి తెలిపారు. అర్జున్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని, ముంబైతోనే ఉంటే అది సాధ్యం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. 
 
మరోవైపు, అర్జున్ టెండూల్కర్ గోవాకు ప్రాతినిధ్యం వహించనున్న విషయాన్ని గోవా క్రికెట్ సంఘం నిర్ధారించింది.  అర్జున్‌తో ట్రయల్ మ్యాచ్‌లు ఆడిస్తామని, అందులో అతడి ప్రదర్శనను బట్టి సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని గోవా క్రికెట్ సంఘం అధ్యక్షుడు సూరజ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

తర్వాతి కథనం
Show comments