Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మేక ఎంత పనిచేసింది.. రష్యా సైనికులకు చుక్కలు చూపించింది..

Advertiesment
goats
, సోమవారం, 27 జూన్ 2022 (18:03 IST)
రష్యా సైనికులకు చుక్కలు చూపించింది ఓ మేక. ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మేక చేసిన పనికి 40మందికిపై రష్యా సైనికులు గాయాలపాలయ్యారు.
 
ఓ మేక రష్యా సైనికులను వణికించిందని..40 మందికిపైగా గాయపడటానికి కారణమైందని యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఓ సాధారణ మేక చేసిన పనికి రష్యా సైనికులు ఎందుకు వణికిపోయారు. 
 
యుక్రెయిన్‌లోని జపొరోజియా పట్టణానికి కాస్త దూరంలో ఉన్న కిన్ స్కీ రోజ్డొరీ గ్రామంలోని ఓ ఆస్పత్రి సమీపంలో రష్యా సైనికులు బూబీ ట్రాప్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. 
 
గ్రనేడ్లను నేలలో వరుసగా అమర్చి వాటికి తీగలను అనుసంధానం చేసి పెడుతున్నారు. ఎవరైనా అటువైపుగా వచ్చినప్పుడు కాలికి ఆ తీగలు తాకి.. గ్రనేడ్లు పేలిపోతాయి.
 
సైనికులు అలా ట్రాప్‌లను అమర్చుతుండగా.. సరిగ్గా అదే సమయంలో కాస్త దూరంలో ఉన్న ఓ మేకల ఫామ్ నుంచి ఓ మేక తప్పించుకుని బయటికి వచ్చింది. ఆస్పత్రివైపు వెళ్లి సైనికులు బూబీ ట్రాప్‌లను అమర్చుతున్న ప్రాంతం వైపు పరుగెత్తింది. మొదట ఒక ట్రాప్ దాని కాలికి తగిలి గ్రనేడ్ పేలింది. 
 
దీనితో భయపడిన మేక వేగంగా పరుగెత్తడంతో వరుసగా ఒకదాని తర్వాత మరోటి గ్రనేడ్ లన్నీ పేలిపోయాయి. వాటిని అమర్చుతూ వెళ్తున్న రష్యా సైనికులు కకావికలంగా పరుగులుపెట్టారు. ఈ పేలుళ్లలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు చనిపోయి ఉంటారని యుక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లీతో పాటు ఆరేళ్ళ కుమార్తెపై అత్యాచారం.... ఎక్కడ?