మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్ వ్యాట్‌తో ఉన్న అతని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న అర్జున్ టెండూల్కర్.. తాజాగా ఆమెతో కలిసి డిన్నర్ చేశాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరూ కెమెరాలు ఫోజులివ్వగా ఆ ఫొటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు అర్జున్.. చొక్కా లేకుండా తన కండలు చూపిస్తుండగా.. వ్యాట్ మాత్రం ఓకే అన్నట్లు సైగలు చేస్తోంది.
ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొంపదీసి డానియల్ వ్యాట్.. అర్జున్‌ను బుట్టలో వేసుకుందా? అని ఒకరంటే.. అతను చాలా చిన్నపిల్లాడని మరొకరు అంటున్నారు. ఇంకొందరు మాత్రం వారి బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతున్నారు.
ఇంగ్లండ్ మహిళల జట్టు ఓపెనర్ అయిన డానియల్ వ్యాట్‌కు సచిన్ కుంటుంబంతో సాన్నిహిత్యం ఉందన్న సంగతి తెలిసిందే.