Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలాసలో జేసీబీతో కరోనా మృతదేహాన్ని తరలించిన అధికారులు.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 27 జూన్ 2020 (15:07 IST)
JCB
శ్రీకాకుళంలో ఘోరం జరిగింది. కరోనాతో మృతి చెందిన వృద్ధుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం జేసీబీతో తరలించారు. ఏపీ, శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఏపీ ప్రభుత్వ అధికారులు డోర్ టూ డోర్ హెల్త్ సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మున్సిపాలిటీకి చెందిన ఓ మాజీ ఉద్యోగి(72)కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతను ఇటీవలే చనిపోయాడు. అయితే ఆ వృద్ధుడి మృతదేహాన్ని స్మశాన వాటికకు జేసీబీ మిషన్‌లో తరలించారు. 
 
ఈ దృశ్యాలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అధికారులేమో పీపీఈ కిట్లు ధరించి ఉన్నారు. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారం కాస్త ఏపీ సీఎం జగన్ దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన ఇది అమానవీయ చర్య అని సీఎం పేర్కొన్నారు. 
 
మృతదేహాన్ని జేసీబీలో తరలించేందుకు ప్లాన్ చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్.. పలాస మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్ ఎన్ రాజీవ్‌ను సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments