ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అన్ని జిల్లాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపించడమే. తాజాగా ఏపీలో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, కరోనా బారిన పడి ఏడుగురు మృత్యువాత పడ్డారు.
రాష్ట్రంలో స్థానికంగా 477 పాజిటివ్ కేసులు నమోదు అవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్ అని తేలింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇప్పటి వరకు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,884కు చేరింది. అలాగే దాదాపు 136 మంది మృతి చెందారు. ప్రస్తుతం 5,760 యాక్టివ్ కేసులు ఉండగా...కరోనా నుంచి కోలుకుని 4,988 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇకపోతే, జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూరం 1080, చిత్తూరు 699, ఈస్ట్ గోదావరి 824, గుంటూరు 958, కడప 500, కృష్ణ 1179, కర్నూలు 1555, నెల్లూరు 522, ప్రకాశం 218, శ్రీకాకుళం 61, విశాఖపట్టణం 407, విజయనగరం 99, వెస్ట్ గోదావరి 681 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.