Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో నాలుగో కరోనా వేవ్ ప్రభావం ఎంత?

Webdunia
సోమవారం, 21 మార్చి 2022 (14:03 IST)
భారత్‌ కరోనా రెండు వేవ్‌లను చవిచూసింది. ఇక రాబోయే రెండు నెలల్లో ఎప్పుడైనా నాలుగో కోవిడ్ వేవ్ భారత్‌ను తాకే అవకాశం వున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దక్షిణాసియా దేశాలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. 
 
చైనా, కొన్ని ఇతర దేశాలు గత కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులలో గణనీయమైన పెరుగుదలను చూశాయి, దీని వల్ల త్వరలో మరొక వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఈ నాలుగో వేవ్ ప్రభావం దేశంపై ఎలా వుంటుందంటే.. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జూన్ నెలలో నాల్గవ కరోనా వేవ్ భారతదేశాన్ని తాకే అవకాశం ఉంది. 
 
థర్డ్ వేవ్ ఎఫెక్ట్ భారత్‌పై పెద్దగా లేదు. భారతదేశంలో మూడో వేవ్ తీవ్రత రేటు తక్కువగా నమోదైంది. అందువల్ల రాబోయే నాలుగో కరోనా వేవ్‌ ప్రభావం తక్కువగా వుండవచ్చునని అంచనా మాత్రమే. కానీ ఏదిఏమైనా నాలుగో కోవిడ్ వేవ్‌కు భారత్ సిద్ధంగా ఉండాలని, తదనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
 
గత రెండు సంవత్సరాల నుండి చైనా కరోనాతో నానా తంటాలు పడిన సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల ద్వారా రోగనిరోధక శక్తి కారణంగా భారతదేశంలో కోవిడ్ స్ట్రెయిన్ తక్కువ ప్రమాదకరంగా ఉండవచ్చు. 
 
వ్యాక్సినేషన్ డ్రైవ్ కారణంగా భారతదేశం ఇప్పటికే మరొక కోవిడ్ దెబ్బకు సిద్ధంగా ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ తెలిపారు. చాలా మంది ప్రజలు కరోనా వైరస్ వ్యాక్సిన్ రెండు డోస్‌లను పూర్తి చేశారని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments