Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తి పేషెంట్‌కు ట్రీట్మెంట్ ఇస్తే..?

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (14:27 IST)
కరోనా సోకకుండా వుండేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం చేస్తున్నారు. అలాగే కరోనా రోగులు అప్రమత్తంగా వుండాలని వైద్యులు చెప్తూ వుంటారు. కానీ వైద్యులకు కరోనా సోకితే ఐసోలేషన్‌లో వుంటూ చికిత్స తీసుకోవడం చేస్తారు. కానీ ఇక్కడో వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. కరోనా సోకినా.. అలానే పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. బాచూపల్లిలోని ఎస్‌ఎల్‌జి ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఒక కరోనా రోగి వైద్యుల పొరపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. దీనితో అతని కూతురు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే తన తండ్రి మరణించాడని ఆయన కుమార్తె శ్వేత ఆరోపించింది. సుమారు 5 లక్షల వరకు బిల్లు వేసారు అని ఆమె మండిపడింది.
 
55వేల ఇంజక్షన్‌లతో పాటు రోజుకి 10 పీపీఈ కిట్లు ఇవ్వలన్నారని.. కానీ వెంటిలేటర్ పేషెంట్ వద్దకు వెళ్లిన సిబ్బంది అవి ఏమి ధరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరోనా పాజిటివ్ ఉన్న డాక్టర్‌ ట్రీట్మెంట్ చేశారన్నారు. నడుచుకుంటూ వెళ్లిన తన తండ్రిని ఇంజెక్షన్‌లతో పడుకోపెట్టి ప్రస్తుతం గుండెపోటుతో మరణించినట్లు చెప్తున్నారని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. 

సంబంధిత వార్తలు

కొత్త సినిమాను చూడాల‌నుకునే ప్రేక్ష‌కులకు బాగా నచ్చే చిత్రం ల‌వ్ మీ :దిల్ రాజు

తెలుగు డిఎమ్‌ఎఫ్‌తో మహేష్ బాబు ఫౌండేషన్ సహకారం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా’ నుంచి సాంగ్ రిలీజ్

థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న కాజల్ అగర్వాల్ సత్యభామ

అల్లు అర్జున్ పుష్ప -2 ద రూల్ నుంచి శ్రీ‌వ‌ల్లి పై లిరిక‌ల్ సాంగ్ రాబోతుంది

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

ఈ ఫుడ్ తింటే 50 ఏళ్లు దాటినా 30 ఏళ్ల వారిలా కనబడుతారు

తర్వాతి కథనం
Show comments