Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రవాస ఆంధ్రుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్!

ప్రవాస ఆంధ్రుడి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్!
, సోమవారం, 12 అక్టోబరు 2020 (14:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రవాస వ్యక్తి కుటుంబాన్ని కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. ఇంటి యజమాని అనారోగ్యంతో చనిపోయినప్పటికీ.. భార్యాపిల్లలు కడచూపుకు నోచుకోలేకపోయారు. దీనికి కారణం ఆయన హైదరాబాద్‌లో చనిపోతే, భార్యాపిల్లలు మాత్రం సౌదీలో చిక్కుకునిపోయారు. చివరకు ఓ సామాజిక కార్యకర్త నాజ్ షౌకత్ అలీ పుణ్యమాని ఆ భార్యపిల్లలు స్వదేశానికి చేరుకున్నారు. ఇక్కడు వచ్చాకగానీ తమ ఆశాజ్యోతి ఇకలేరనే విషయం తెలుసుకుని గుండెపగిలిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే,  విజయవాడకు చెందిన కిలంపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా సౌదీలోనే పని చేస్తున్నారు. ఆ తర్వాత ఈయన తన భార్య శారద, కుమార్తె సంజన శివానీలను కూడా సౌదీకి తీసుకెళ్లారు. కుమారుడు మాత్రం హైదరాబాద్‌లో ఉంటూ నివిసిస్తున్నాడు. 
 
అయితే, అత్యవసర పని నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సత్యనారాయణ అనారోగ్యం బారినపడ్డారు. ఆ తర్వాత ఆయన్ను కుమారుడు గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన నెల రోజుల క్రితం చనిపోయారు. కానీ, భార్యా, కుమార్తె మాత్రం గల్ఫ్‌లో చిక్కుకునిపోయారు. 
 
అయితే, సత్యనారాయణ వీసాపైనే వీరిద్దరూ నివాసముండటంతో, గల్ఫ్‌ దేశం విడిచి వెళ్లడానికి ఎగ్జిట్‌ వీసాపై ఆయన అనుమతి అవసరం. ఆయన మరణించడంతో వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 
సత్యనారాయణ యాజమాని వీరి వీసాలను ఎగ్జిట్‌ చేయడానికి వీలున్నప్పటికీ, వీరికి ఆయన గురించి సమాచారం తెలియకపోవడంతో జాప్యం జరిగింది. తల్లికూతుళ్ల పాస్‌పోర్టుల గడువు కూడా ముగియడమూ అవరోధంగా మారింది. 
 
అయితే, హైదరాబాద్‌లో ఉంటున్న వీరి కుమారుడు.. తల్లి, సోదరిలను స్వదేశానికి రప్పించడానికి చేయని ప్రయత్నంటూ లేదు. తండ్రి మరణవార్తను తల్లికి చెప్పలేదు. భర్త గురించి కొడుకును ఫోన్‌లో ప్రశ్నిస్తూ బెంగతో శారద అనారోగ్యం పాలయ్యారు. 
 
వీరి పరిస్థితి తెలుసుకున్న సామాజిక కార్యకర్త నాజ్‌ షౌకత్‌ అలీ భారతీయ ఎంబసీ సహాయంతో తల్లీకూతుర్లను మిషన్‌ వందే భారత్‌లో భాగంగా విమానంలో ఎట్టకేలకు ఆదివారం హైదరాబాద్‌కు పంపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్ స్టిక్ వద్దు.. ఇనుము దోసె పెనం వాడుతున్నారా?