Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబాన్నే కాటేసిన కరోనా.. నిండు గర్భిణి మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది..

Webdunia
శనివారం, 18 జులై 2020 (16:58 IST)
కరోనా ఓ కుటుంబాన్నే మింగేసింది. చివరికి గర్భణీ మహిళను మాత్రం ఒంటరిగా నిలబెట్టేసింది. ఈ ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటన గురించి తెలిస్తే.. ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ప్రేమించి పెళ్లి చేసుకొని.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలనుకున్న ఓ జంటను కరోనా వెంటాడింది. నిండుకుటుంబాన్ని పొట్టనబెట్టుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త, అత్తమామలతో ఆ యువతి కాపురం హాయిగా సాగింది. వారి సంతోషానికి గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. ఇంతలోనే వారి కుటుంబంలోకి కరోనా మహమ్మారి వచ్చి చేరింది. ఆమె అత్తమామలకు కరోనా సోకింది. వీరిద్దరూ వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. వరంగల్ ఎంజీఎంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె భర్త కూడా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. ఎన్నో ఆశలతో కోరి పెళ్లిచేసుకున్న భర్త కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. 
 
కడుపులో బిడ్డను చూడకుండానే వారం వ్యవధిలోనే అటు అత్తమామలు, ఇటు భర్త చనిపోవడంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. కరోనా కాటుకు ఆ కుటుంబంలో ముగ్గురు బలైన తీరు అందరినీ కలచివేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments