Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్.. కరోనాపై పోరుకు రూ.3100 కోట్లు కేటాయింపు

Webdunia
బుధవారం, 13 మే 2020 (21:15 IST)
దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించేందుకు, దానిపై యుద్ధం చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. ఈ ఫండ్ నుంచి కరోనాపై పోరుకు భారీగా నిధులు కేటాయించింది. 
 
ఇదే అంశంపై పీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాపై పోరుకు పీఎం కేర్స్ ఫండ్‌ నుంచి రూ.3100 కోట్లను కేంద్రం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొంది. ఈ నిధులతో వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్రం పెద్దపీట వేసింది.
 
ఈ డబ్బులో వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2000 కోట్లను కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. రూ.100 కోట్లను వ్యాక్సిన్ అభివృద్ధికి కేటాయించింది. వలస కార్మికులకు కూడా అండగా నిలవాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా.. రూ.1000 కోట్లను వలస కార్మికుల కోసం కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. 
 
మరోవైపు, కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం చేయని పోరాటమంటూ లేదు. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం చేపడుతున్న చర్యలకు బ్రిక్స్ దేశాలకు చెందిన 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' ఆర్థికసాయం ప్రకటించింది. 
 
ఇందులోభాగంగా, భారత్‌కు 1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.7.5వేల కోట్లపైగా రుణం అందించాలని ఈ బ్యాంకు నిర్ణయించింది. ఏప్రిల్ 30న ఈ రుణానికి బ్యాంకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని నిరోధించి తద్వారా సామాజిక, ఆర్థిక, ప్రాణ నష్టాలు జరగకుండా చూసేందుకు ఈ రుణం అందిస్తున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

నా తలపై జుట్టంతా ఊడిపోయింది.. నీవు మాత్రం అలాగే ఎలా ఉన్నావయ్యా? రజనీకాంత్

నేచురల్ స్టార్ నాని క్లాప్ తో దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments