Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోడీ ప్రసంగం విని రాత్రంతా జాగారం చేశా: ఆనంద్ మహీంద్రా

Advertiesment
ప్రధాని మోడీ ప్రసంగం విని రాత్రంతా జాగారం చేశా: ఆనంద్ మహీంద్రా
, బుధవారం, 13 మే 2020 (10:01 IST)
దేశాన్ని కరోనా కోరల నుంచి రక్షించేందుకు కేంద్రం దశల వారీగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. పైగా, గత 50 రోజులుగా దేశం లాక్డౌన్ వుంది. దీంతో అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చితికిపోయాయి. కూలీలు, కార్మికులు, చిరు ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ లాక్డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు అపారనష్టం జరిగింది. 
 
దీంతో ఆర్థిక రంగాన్ని ఉత్తేజపరిచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ విలువ రూ.20లక్షల కోట్లు. దీన్ని దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు స్వాగతించాయి. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దాదాపు 10 శాతానికి సమానమైన ఈ ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని బుధవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించనున్నారు. 
 
అయితే, మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఈ ఆర్థిక ప్యాకేజీపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్రా స్పందించారు. ప్రధాని ప్రసంగం అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుందన్నారు. బతికితే చాలనుకునే స్థాయి నుంచి, బలపడే స్థాయికి మారేందుకు అవకాశాన్ని దగ్గర చేసిందని ట్వీట్ చేశారు. 
 
1991లో ఇండియాలో వచ్చిన ఆర్థిక పరివర్తనా ఉద్యమం మరోసారి జరగనుందని, ప్రధాని ప్రసంగం చూసిన తరువాత, తనకు రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదని వ్యాఖ్యానించారు. అలాగే, మరో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా స్పందించారు. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ, కేవలం చరిత్రాత్మకమే కాదని, భూమి, కార్మికులు, ద్రవ్య లభ్యత, చట్టాలు తదితర ఎన్నో విభాగాలపై దృష్టి సారించిన అద్భుతమని కొనియాడారు. దీని వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాలో తీవ్ర నిరుద్యోగం