Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేకింగ్: కరోనాకు వ్యాక్సిన్.. 90 శాతం పనిచేస్తోంది.. అదేంటంటే?

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (21:08 IST)
ప్రపంచ జనాలకు చుక్కలు చూపిస్తున్న కరోనా కోరలను త్రుంచి పారేసేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనే పనిలో వున్నారు. దీంతో ప్రపంచం మొత్తం కోవిడ్ వ్యాక్సిన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వందలాది వ్యాక్సిన్లు ప్రయోగాల దశలో ఉండగా, పదుల సంఖ్యలో వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు ట్రయల్స్ పూర్తి చేసుకున్నా వాటి ఫలితాలపై స్పష్టత లేదు. భారత్‌లోని ఫార్మా సంస్థలు అభివృద్ధి చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రైయల్స్ కూడా చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే.
 
అయితే తాజాగా ఫైజర్‌, బయోఎన్‌టెక్ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం ప్రభావితం చూపుతున్నట్టు తేలింది. మూడో దశ ట్రయల్స్ ఆధారంగా ఈ విషయం తేలిందని ప్రకటించింది ఫైజర్ సంస్థ. 
 
రెండో డోసు ఇచ్చిన ఏడు రోజుల తర్వాత రోగుల్లో కోవిడ్‌కు వ్యతిరేక రక్షణ శరీరంలో అభివృద్ధి అయినట్టు గుర్తించామని ఫైజర్ సంస్థ పేర్కొంది. తొలి డోసు ఇచ్చిన 28 రోజుల తర్వాత కూడా ఈ తేడా కనిపించినట్లు వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ద్వారా కోవిడ్‌ 19ను నివారించే తొలి ఫలితాలు వచ్చినట్లు ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా స్పష్టం చేశారు. 
 
ఈ ఏడాదిలోనే 5 కోట్ల వ్యాక్సిన్స్‌ ఉత్పత్తి చేసి పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇక, 2021లో వచ్చే ఏడాది దాదాపు 103 కోట్ల డోసులను పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఓ అడుగు ముందుకు వేసినట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments