Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ కోరల నుంచి బయటపడ్డ రాజశేఖర్, డిశ్చార్జ్

Advertiesment
కోవిడ్ కోరల నుంచి బయటపడ్డ రాజశేఖర్, డిశ్చార్జ్
, సోమవారం, 9 నవంబరు 2020 (19:59 IST)
గత కొన్ని రోజులుగా కోవిడ్-19తో బాధపడుతున్న సినీ హీరో డాక్టర్ రాజశేఖర్ ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో డిశ్చార్జ్ అయ్యారు
.
 
కాగా ఆయన ఆస్పత్రిలో చేరిన తొలి రోజు నుంచే ఐసీయూ వార్డులో ఉంచి చికిత్స అందించారు. పైగా ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన భర్త ఆరోగ్యంపై నటి జీవితా రాజశేఖర్ అప్పట్లో ఇలా చెప్పారు. 'రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగా మెరుగుపడింది. త్వరగా కోలుకుంటున్నారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా కేరింగ్ తీసుకున్నారు. అందువల్ల రాజశేఖర్ విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారు. త్వరలోనే ఐసీయూ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు.  
webdunia
రాజేశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారని ఓ వార్త ప్రచారం అవుతోంది. అది నిజం కాదు. ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరు. నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. అయితే వెంటిలేటర్ మీద మాత్రం లేరు. నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో ఆక్సిజన్ అందించారు. మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నారు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు చేసిన ప్రార్థనలు కారణంగానే రాజశేఖర్ క్షేమంగా ఉన్నారు అని జీవితా రాజశేఖర్ ఆమధ్య చెప్పారు. ఈరోజు రాజశేఖర్ డిశ్చార్జ్ అయ్యారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ డ్రగ్స్ కలకలం: అర్జున్ రాంపాల్ ఇంట్లో ఎన్సీబీ అధికారులు సోదా