దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ కరోనా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో అత్యధికంగా ఏడు వేల 745 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 77 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోని వివిధ ఆసుపత్రులు ఐసీయూ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయి.
ఢిల్లీలో రోజు రోజుకు చలితీవ్రత పెరగుతూ గాలి నాణ్యత పూర్తిగా పడిపోయింది, కాలుష్యం పెరిగిపోయింది. అదే విధంగా పండుగ సీజన్ కావడంతో ప్రజలు గుంపులుగా గుంపులుగా బయటకు వస్తుండటంతో కరోనా కేసులు పెరగడానికి కారణమవుతోంది.
కరోనా విజృంభణతో ఢిల్లీ ప్రభుత్వం బాణా సంచా కాల్చడంపై నిషేధం విధించింది. పొల్యూషన్‌కు తోడు బాణా సంచా కాల్చడంతో వచ్చే పొగ తోడైతే కరోనా కేసులు విపరీతంగా పెరిగే అవకాశం ఉండటంతో ఢిల్లీలో బాణా సంచాకాల్పడంపై నిషేధం విధించింది కేజ్రీవాల్ సర్కార్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు నిబంధనలు కఠినంగా పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.