Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 38 వేల కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:27 IST)
దేశంలో కొత్తగా మరో 38 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229కు చేరింది. అలాగే, ఆదివారం 38,660 మంది కోలుకున్నారు. 
 
ఇక మృతుల విషయానికి వస్తే, ఆదివారం 499 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,14,108కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,08,456 మంది కోలుకున్నారు. 
 
4,21,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 40,64,81,493 వ్యాక్సిన్ డోసులు వేశారు.    
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 44,54,22,256 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 14,63,593 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments