Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

కొలంబో వన్డే మ్యాచ్ : ఇండియా భారత్ టార్గెట్ 263 రన్స్

Advertiesment
Colombo ODI
, ఆదివారం, 18 జులై 2021 (20:02 IST)
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక జట్టుతో యంగ్ ఇండియా వన్డే క్రికెట్ సిరీస్‌ను ఆదివారం నుంచి ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. 
 
ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు నిలువరించారు. షనాకా 39, అసలంక 38 పరుగులు చేశారు. చివర్లో కరుణరత్నె (43 నాటౌట్) ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో దీపక్ చాహర్, కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. 
 
ఇకపోతే, తుది జట్టులో చోటు దక్కించుకున్న పాండ్యా బ్రదర్స్ చెరో వికెట్ పడగొట్టారు. కృనాల్ పాండ్యా 10 ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చాడు. కాగా భువనేశ్వర్ కుమార్ ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. దీంతో భారత్ 263 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకిదిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టోక్యో ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కలకలం... ఇద్దరికి పాజిటివ్