Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీకా తీసుకున్న వారికి గుడ్ న్యూస్

Webdunia
సోమవారం, 19 జులై 2021 (10:07 IST)
కరోనా విలయం సృష్టించిన అతలాకుతలం అంతా ఇంతా కాదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరిని కలవర పెట్టిన వైరస్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు బలితీసుకుంది. కరోనా టీకాలు తీసుకున్న వారిలో గణనీయమైన పనితీరు చూపాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్ ఓ అధ్యయనం నిర్వహించింది.
 
కొవిడ్ రెండో దశ ఉధృతి సమయంలో నిర్వహించిన ఓ అధ్యయనం దేశంలోనే మొదటిది. ఈ పరిశీలనలో భాగంగా ఆ సంస్థ పలు విషయాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా మొత్తం 677 కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించారు. 80 శాతం మందికి పైగా డెల్టా వేరియంట్ బారిన పడ్డారని తెలిపింది. ఇప్పటికే ఒకటి లేక రెండు డోసుల టీకా తీసుకున్న అనంతరం కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది.
 
వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించారు. ఇందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ (B.1.617.2) ను గుర్తించింది. ఆ మొత్తం కేసుల్లో 9.8 శాతం మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చింది. 0.4 శాతం మరణాలు సంభవించాయి. దీన్ని బట్టి టీకా తీసుకోవడం వల్ల ఆస్పత్రిలోచేరాల్సిన పరిస్థితి. మరణాలు తగ్గుతున్నాయని అధ్యయనం సూచించింది.
 
ఇక వీరిలో 482 (71శాతం) మందికి లక్షణాలు కనిపించాయి.29 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. లక్షణాలు ఉన్న వారు జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, జలుబు,రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస తీసుకోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి కరోనా రక్కసి ప్రభావంతో జనం పడుతున్న కష్టాలు వర్ణనాతీతం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments