Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కరోనా ఉగ్రరూపం... ఒకే చితిపై 22 కరోనా మృతదేహాల దహనం

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:48 IST)
భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ప్రతి రోజూ లక్షకుపైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే, అనేక వందల మంది మృత్యువాతపడుతున్నారు. కరోనా రోగుల రికవరీ రేటు కూడా పడిపోతుంది. దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మహారాష్ట్రలో అయితే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే, మరణాల శాతం విపరీతంగా పెరుగుతోంది. స్థానికంగా ఉండే స్మశాన వాటికలన్నీ కూడా కరోనా రోగుల మృతదేహాలతో నిండిపోతున్నాయి. దీంతో శ్మశానంలో ఖననం చేసేందుకు స్థలం కొరత ఏర్పడింది. 
 
ఇటీవల బీడ్ జిల్లా అంబజోగైలోని ఒక ఆశ్రయం వద్ద 8 మందికి దహన సంస్కారాలను ఒకే చితిపై చేసిన విషయం తెల్సిందే. ఇక అహ్మద్ నగర్‌లో కూడా ఇదే తరహా సీన్ రిపీట్ అయింది. అహ్మద్‌నగర్‌లోని అమర్ ధామ్‌లో ఒకేసారి 22 మందికి(కరోనా పేషెంట్స్) దహన సంస్కారాలు జరిపారు. ఈ హృదయ విచారక వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
అమర్‌ధామ్‌లో ఒకేసారి 22 మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు. అలాగే ఒక రోజులో ఏకంగా 42 మందికి చితి పెట్టారట. కాగా, కరోనా రోగులకు దహన సంస్కారాలు చేయడంలో అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పోరేషన్ సవాల్ ఎదుర్కుంటోంది. 
 
అహ్మద్‌నగర్ నుంచి ఆరు మృతదేహాలను అమర్‌ధామ్‌ స్మశాన వాటికకు తీసుకుని వెళ్లినట్లు తాజాగా కార్పోరేషన్ దృష్టికి వచ్చింది. అటు అంబజోగై మునిసిపల్ కార్పొరేషన్ ఒకేసారి 8 మందికి ఒకే చోట దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తంమీద మహారాష్ట్రలో కరోనా వైరస్ మృత్యుఘంటికలను మోగిస్తోంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments