Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా "మహా" విలయం.. ప్రతి 5 నిమిషాలకు ఒకరు మృతి... ఎక్కడ?

కరోనా
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (08:53 IST)
దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఇక్కడ ప్రతి రోజూ 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదతువున్నాయి. పైగా, ఈ వైరస్ ఇప్పట్లో ఉపశమించేలా కనిపించడంలేదు. ప్రభుత్వం ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ.. ఈ వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. 
 
గడచిన కొద్ది రోజులుగా వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తున్నప్పటికీ కరోనా కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో పాలకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా రాష్ట్రంలో మరోమారు కొత్తగా 55 వేలకు మించిన కరోనా కేసులు వెలుగు చూశాయి. గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 297 మంది మృతి చెందారు. 
 
అంతేకాకుండా, ఈ మృతుల లెక్కలను ఓసారి నిశితంగా పరిశీలిస్తే, ప్రతి ఐదు నిముషాలకు కరోనాతో ఒకరు మృతి చెందుతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో కొత్తగా 55,469 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఇదేసమయంలో మొత్తం 34,256 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో గడచిన 24 గంటల్లో 10,030 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహానగరంలో ఇప్పటి వరకూ 4,72,332 మంది కరోనా బారినపడ్డారు.*.txt

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా టీకాల కొరత? హర్షవర్థన్ ఏమంటున్నారు?