Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్మోల్ అంబానీకి కోపం వచ్చింది.. ఎందుకో తెలుసా..?

Advertiesment
అన్మోల్ అంబానీకి కోపం వచ్చింది.. ఎందుకో తెలుసా..?
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (18:10 IST)
Anmol Ambani
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. పారిశ్రామిక వేత్త అనిల్‌ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్‌ అంబానీకి కోవిడ్‌ ఆంక్షలపై కోపం వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అన్మోల్ అంబానీ.. సినీనటులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులకు లేని ఆంక్షలు.. వ్యాపారాలకు మాత్రమే ఎందుకు? అంటూ ఆయన సర్కార్‌పై ఎటాక్ చేశారు. అసలు ఎసెన్షియల్ అర్థం ఏమిటి? అంటూ మహారాష్ట్ర అధికారులపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
 
ప్రభుత్వ ఆంక్షలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. వరుస ట్వీట్లు చేసిన అన్మోల్ అంబానీ.. ప్రొఫెషనల్ నటులు.. సినిమాల షూటింగ్‌లు కొనసాగించుకోవచ్చు.. క్రికెటర్లు అర్థరాత్రి వరకు ఆడుకోవచ్చు. 
 
ఇక, ప్రొఫెషనల్ రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలతో ర్యాలీలు కొనసాగించవచ్చు. సభలు కొనసాగించవచ్చు. కానీ, వ్యాపారం లేదా పని ఎసెన్షియల్ కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరి పని వారికి అత్యవసరమే నంటూ సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్లు చేశారు. 
 
కాగా, కోవిడ్ ప్రారంభంలోనూ మహారాష్ట్రలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. సెకండ్ వేవ్‌లోనూ.. గత రికార్డులను అధిగమించి.. రోజువారి కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్లిసిటీ కోసం నగ్నంగా ఫోజులు.. దుబాయ్ పోలీసులు ఏం చేశారంటే..?