Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ జగమొండిది.. 19 సార్లు పరీక్షల తర్వాత పాజిటివ్... ఎక్కడ?

Webdunia
బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:31 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ జగమొండిదని తెలుస్తోంది. కొందరికి పదుల సంఖ్యలో పరీక్షలు చేస్తున్నప్పటికీ ఈ వైరస్ లక్షణాలు బయటపడటం లేదు. తాజాగా ఓ మహిళకు ఏకంగా 18 సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయినప్పటికీ బయటపడలేదు. చివరకు 19వ దఫాలో జరిపిన పరీక్షల్లో ఈ వైరస్ బయటపడింది. ఈ పరిస్థితుపై వైద్యులు ఆందోళన చెందుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేర‌ళ‌ రాష్ట్రంలోని ప‌త‌న‌మిట్ట ప్రాంతానికి చెందిన ఓ 62 యేళ్ల మహిళతో పాటు.. ఆమె కుటుంబ సభ్యలు గత ఫిబ్రవరి నెలలో ఇటలీ వెళ్లి వచ్చారు. ఆ తర్వాత వీరంతా సాధారణ జీవనం గడుపుతూ వచ్చారు. వీరికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఐదుగురికి నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. 
 
వీరిలో 62 యేళ్ళ మహిళకు కూడా ఇదే తరహా ఫలితం వచ్చింది. కానీ, ఆమెలో కరోనా లక్షణాలు కనిపించసాగాయి. దీంతో ఏకంగా 18 సార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయినప్పటికీ ఈ జగమొండి కరోనా బయటపడలేదు. దీంతో మరోమారు అంటే 19వ సారి పరీక్షచేశారు. ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
 
దీనిపై వైద్యులు స్పందిస్తూ, 'ఇప్ప‌టివ‌ర‌కు ఆమెలో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేవు. కాంబినేష‌న్ డ్రగ్స్‌ను మేం చాలాసార్లు ప్ర‌య‌త్నించాం. అయినా ప‌రిస్థితిలో మార్పు లేదు' అని ప‌త‌న‌మిట్ట జిల్లా వైద్యాదికారి డాక్ట‌ర్ ఎన్ షీజా అన్నారు. 
 
ఇప్ప‌టికే 42 రోజుల‌పాటు ఆమెను హాస్పిట‌ల్‌లోనే చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. ల‌క్ష‌ణాలు లేవు క‌దా అని డిశ్చార్జ్ చెయ్య‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని కాబ‌ట్టి కోజెన్‌చేరి హాస్పిట‌ల్ కి త‌ర‌లిస్తాం.. ప‌రిస్థితిలో ఎలాంటి మార్పు లేకుంటే కొట్టాయం మెడిక‌ల్ కాలేజి ఆసేప‌త్రికి బ‌దిలీ చేయాల‌ని చూస్తున్న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు. 
 
క‌రోనా రోగుల‌ను 14 రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉంచాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అయితే కేర‌ళ‌లో మాత్రం ఇంక్యుబేష‌న్ వ్య‌వ‌ధిని 28 రోజుల‌వ‌ర‌కు పొడిగించింది. ఇటీవ‌లే కేర‌ళ‌లో ఓ ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. 
 
ఓ మ‌హిళ త‌బ్లీగి జ‌మాత్ స‌భ్యులు ప్ర‌యాణించిన కంపార్ట్‌మెంట్‌లో ప‌ర్య‌టించింది. అయితే ఆమెలో 22 రోజ‌ల త‌ర్వాత క‌రోనా ల‌క్ష‌ణాలు వెలుగు చూశాయి. దీంతో కేరళ సర్కారు 14 రోజల క్వారంటైన్ సమయాన్ని ఏకంగా 28 రోజులకు పొడగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments