Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్త స్నానం చేయడం లేదనీ పోలీసులకు భార్య ఫిర్యాదు

భర్త స్నానం చేయడం లేదనీ పోలీసులకు భార్య ఫిర్యాదు
, బుధవారం, 22 ఏప్రియల్ 2020 (09:48 IST)
కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ కారణంగా దేశంలో గృహహింస పెరిగిపోయింది. భార్య భర్తలు 24 గంటలు ఇంట్లోనే ఉండడంతో వారి మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భర్తలు పెట్టే హింసలు భరించలేక చాలా మంది మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 
 
అలాగే, పలు ప్రాంతాల్లో భార్యలు పెట్టే హింసలు భరించలేక భర్తలు కూడా స్టేషన్ మెట్లు తొక్కుతున్నారు. తాజాగా బెంగుళూరులో ఓ విచిత్రమైన కేసు నమోదైంది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన తన భర్త స్నానం చేయడం లేదనీ, దీనివల్ల దుర్వాసన వస్తోందంటూ ఓ మహిళ జయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, జయనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపు నడుపుతున్నాడు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి షాపు తెరవకుండా ఇంటిపట్టునే ఉంటున్నాడు. దీంతో భార్యను వేధించసాగాడు. పైగా, స్నానం కూడా చేయడం మానేశాడు. స్నానం చేయకపోవడంతో అతని నుంచి దుర్వాసన వస్తుందని, అలాగే తన గదిలోనే నిద్రించాలని బలవంతం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.
 
అంతేకాకుండా, తండ్రిని చూసి తొమ్మిదేళ్ల కూతురు కూడా వారం రోజులుగా స్నానం చేయడం లేదని ఆమె పోలీసులకు వివరించారు. వ్యక్తి గత శుభ్రత గురించి ఎంత వివరించినా ఆయన పాటించడం లేదని, పైగా గదిలోకి వెళ్లకపోవడంతో తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతన్ని పిలిపించి వ్యక్తిగత శుభ్రత గురించి కౌన్సిలింగ్‌ ఇచ్చామని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గ్రామ వలంటీర్లకు జగన్ కానుక.. రూ.50 లక్షల బీమా సౌకర్యం