దేశంలో టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 41,76,56,752

Webdunia
గురువారం, 22 జులై 2021 (10:45 IST)
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ సోకినా ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా కరోనా టీకాల పంపిణీ జోరుగా సాగుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 41,76,56,752 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
అలాగే, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2.88 కోట్ల కరోనా టీకాలు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు 43,25,17,330 వ్యాక్సిన్ మోతాదులను అందించినట్లు వివరించింది. బుధవారం నాటికి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 187వ రోజుకు చేరగా.. ఒకే రోజు 20,83,892 వ్యాక్సిన్ మోతాదులను అందించారు. 
 
ఇందులో 10,04,581 మొదటి మొతాదులు కాగా 95,964 మందికి రెండో డోసు వేశారు. 18 నుంచి 44 యేళ్లలోపు వారిలో 13,04,46,413 మందికి మొదటి డోసు, మరో 53,17,567 మందికి రెండో మోతాదు అందజేసినట్లు వివరించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు 8-44 ఏజ్‌ గ్రూప్‌లో కోటికిపైగా మోతాదులు వేశాయని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash: యశ్ టాక్సిక్ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్ కుదుర్చుకున్న ఫార్స్ ఫిల్మ్

రజనీకాంత్ చిత్ర నిర్మాతకు మద్రాస్ హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

Santosh Shobhan: కపుల్ ఫ్రెండ్లీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ : ధీరజ్ మొగిలినేని

Tanikella Bharani: శివ భక్తితో లీనమై శివోహం పాటలో నటించా : తనికెళ్ల భరణి

జీవితంలో అందరికీ కనెక్ట్ అయ్యే సీన్స్ ఫంకీ లో ఉంటాయి : కె.వి. అనుదీప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

TrueSilver లాంచ్ ద్వారా దేశీయ డీ2సీ సిల్వర్ జ్యూవెలరీ మార్కెట్ లోకి ACPL ఎక్స్ పోర్ట్స్

అమెజాన్‌లో వ్యాలెంటైన్స్ డే స్టోర్‌తో ప్రేమ సంబరాలు జరుపుకోండి

ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన

గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments