Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్త కేసుల కంటే.. రికవరీ కేసులే ఎక్కువ...

Webdunia
గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:33 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. అయితే.. గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల కంటే.. ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో ఏకంగా 87374 మంది ఈ వైరస్ నుంచి విముక్తి పొందారు. 
 
గత 24 గంటల్లో దేశంలో 86,508 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 57,32,519కి చేరింది.
 
ఇకపోతే, గ‌త 24 గంట‌ల సమయంలో 1,129 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 91,149కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 46,74,988 మంది కోలుకున్నారు. 9,66,382 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
                    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,74,36,031 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,56,569 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
అలాగే, తెలంగాణ‌లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన కోవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,176 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,004 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,79,246కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,48,139 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,070కు చేరింది. ప్రస్తుతం 30,037 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 308, రంగారెడ్డి జిల్లాలో 168 కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

టైం బాగోలేనప్పుడు చాలాసార్లు ధైర్యం ఇచ్చింది నానినే : అల్లరి నరేష్

ఇంతకుముందులా శంకర్ చిత్రం మిస్ ఫైర్ కాదు. గేమ్ ఛేంజర్ లో ట్విస్టులు ఉంటాయి : శ్రీకాంత్

డాకు మహారాజ్ నుంచి డేగ డేగ డేగ దేఖో వో దేఖో బేగా.. గీతం విడుదల

Radhika Apte: రాధికా ఆప్టేకు ఆడబిడ్డ పుట్టి వారం రోజులైందట!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments