Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాపిల్ ఉత్పత్తులు కొంటున్నారా? ఇక డైరెక్ట్ కస్టమర్ సపోర్టు..!

Advertiesment
Apple Store Online
, బుధవారం, 23 సెప్టెంబరు 2020 (16:24 IST)
ఇకపై థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రోడక్ట్స్‌ను కొనుక్కోవచ్చు. ఇంకా డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు లభిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్‌లైన్‌ టీమ్ సిద్ధంగా ఉన్నట్లు యాపిల్‌ ప్రకటించింది.

ఆన్‌లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం ఆపిల్ బ్లూడార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
 
యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా 38వ ఆన్‌లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి. ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకునేందుకు.. ఇంగ్లీష్‌లో ఆన్‌లైన్‌లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు ఇవ్వనున్నారు. 
 
యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా భారతదేశంలో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ప్రోడక్ట్స్‌ను అమ్మకానికి ఉంచనున్నారు. ఐపాడ్‌లను, యాపిల్ ఎయిర్ పోడ్స్, హోమ్ పోడ్, స్మార్ట్ స్పీకర్స్, మ్యాక్ కంప్యూటర్లను.. ఇలా చాలా వాటిని అమ్మకానికి ఉంచనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మాయిని కాళ్లుచేతులు కట్టేసి.. కిరోసిన్ పోసి నిప్పంటించారు...