Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకండ్ వేవ్ అంతమైన 6 నుంచి 6 నెలల తర్వాత థర్డ్ వేవ్ విజృంభణ

Webdunia
గురువారం, 20 మే 2021 (10:21 IST)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి సెకండ్ వేవ్.. వచ్చే జూలై నాటికి అంతమైపోవచ్చునని.. అయితే థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం వుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అది కూడా సెకండ్ వేవ్ అంతమైన 6 నుంచి 8 నెలల తర్వాత వ్యాపించే ముప్పు ఉందని చెప్తున్నారు. అయితే రెండో వేవ్ అంత ప్రభావం ఉండదంటున్నారు. ఒక్క రకంగా చెప్పాలంటే ఇది ఊరటనిచ్చే విషయమే.
 
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్‌, టెక్నాలజీ విభాగం సైంటిస్టుల బృందాన్ని ఏర్పాటు చేసింది. 'సూత్ర' (ససెప్టబుల్‌, అన్‌డిటెక్టెడ్‌, టెస్టెడ్‌ (పాజిటివ్‌) అండ్‌ రిమూవ్డ్‌ అప్రోచ్‌) అనే మోడల్‌ ద్వారా అంచనా వేసింది. దేశంలో మే నెలాఖరుకల్లా రోజువారీ కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుతుందన్నారు. జూన్‌ ఆఖరు నాటికి 20వేలకు తగ్గుతుందని తెలిపారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కరోనా పీక్‌ దశకు చేరినట్లు తెలిపారు. తమిళనాడు, పంజాబ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మే 19 నుంచి 31 మధ్య కరోనా కేసుల తీవ్రత పీక్ దశకు చేరుతాయని అంచనా.
 
'సూత్ర' మోడల్ ప్రకారం.. దేశంలో అక్టోబరు వరకు కరోనా మూడో ఉద్ధృతి ఉండకపోవచ్చని అంటున్నారు. వ్యాక్సినేషన్‌ పెంచడం ద్వారా వైరస్ ప్రభావితం తక్కువగా ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. 
 
కరోనా మహమ్మారుల తీవ్రత, ప్రభావం వంటి అంచనా వేసేందుకు గణితశాస్త్ర విధానాల్లో ఒకటి సూత్ర. కొవిడ్‌పై అధ్యయనం చేసేందుకు గతేడాదిలోనే ఈ మోడల్‌ను అనుసరిస్తున్నారు. ఈ 'జాతీయ కొవిడ్‌-19 సూపర్‌మోడల్‌ కమిటీ' దీని ఆధారంగానే భారత్‌లో కొవిడ్‌ వ్యాప్తిపై అంచనాలను రూపొందించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments