Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాయె... ప్రధాని మోడీ పాపులారిటీ దిగజారిపాయె...

Advertiesment
PM Modi
, బుధవారం, 19 మే 2021 (19:53 IST)
కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాపులారిటీ కూడా నానాటికీ దిగజారిపోతోంది. కరోనా తొలి దశ వ్యాప్తి సమయంలో ఎన్నో దేశాలకు ఆపద్భాంధవుడుగా మారిన ప్రధాని మోడీ.. కరోనా రెండో దశలో మాత్రం తన దేశ ప్రజలను కరోనా వైరస్ నుంచి రక్షించలేక పోయారు. ఫలితంగా కరోనా వైరస్ బారినపడి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ఆయన ఇంతకుముందెన్నడూ లేనివిధంగా అపకీర్తిని మూటగట్టుకున్నారు. 
 
దేశం యావ‌త్తూ క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న త‌రుణంలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ప్ర‌ధాని మోడీ రేటింగ్ అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయింది. ఈ విష‌యాన్ని ఆమెరికాకు చెందిన ఒక స‌ర్వే సంస్థ త‌న నివేదిక స్ప‌ష్టం చేసింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోడీ ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో సైతం భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు.
 
గ‌త మూడు ద‌శాబ్దాల్లో ఏ ఇండియ‌న్ లీడ‌ర్‌కు సాధ్యం కానీ మెజారిటీని ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ సుసాధ్యం చేశారు. దాంతో బ‌ల‌మైన జాతీయ‌స్థాయి నాయ‌కుడిగా ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 2.5 కోట్లు దాట‌డం ఆయ‌న ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బారేలా చేసింది. 
 
క‌రోనా క‌ట్టడి కోసం స‌న్న‌ద్ధ‌మ‌వ‌డంలో మోడీ ప్ర‌భుత్వం విఫ‌లం కావ‌డంవ‌ల్లే మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రించింద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెతున్నాయి. అమెరికాకు చెందిన డాటా ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ క‌న్స‌ల్ట్స్ ప్ర‌పంచ‌స్థాయి నేత‌ల పాపులారిటీని నిరంత‌రం ట్రాక్ చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు వెల్ల‌డిస్తుంటుంది. 
 
ఆ సంస్థ తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ వారం ప్ర‌ధాని మోడీ ఓవ‌రాల్ రేటింగ్ 63 శాతానికి ప‌డిపోయింది. 2019, ఆగ‌స్టులో తాము ప్ర‌ధాని మోడీ పాపులారిటీని ట్రాక్ చేయ‌డం మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఇదే అత్యంత క‌నిష్ట రేటింగ్ అని ఆమెరికా రేటింగ్ సంస్థ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరీంనగర్‌ విద్యార్థి అదుర్స్ - 'ట్రేస్ చాట్'కు గ్లూగుల్ ప్లే స్టోర్ ఆమోదం