Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాటుకు ఆఫ్రికా ఎస్వాతినీ దేశ ప్రధాని మృతి

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (15:18 IST)
కరోనా కాటుకు ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం 12 లక్షల జనాభా కలిగిన ఆఫ్రికా దేశమైన ఎస్వాతినీలో ఇప్పటివరకు 6,768 కరోనా కేసులు నమోదవగా, 127 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

తాజాగా ఆఫ్రికాలోని ఎస్వాతినీ అనే దేశానికి ప్రధాన మంత్రి ఆంబ్రోసో మాండ్వులో లామిని (52) కరోనాతో మృతిచెందారు. నాలుగు వారాల క్రితం కరోనా బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్వాతినీ ఉపప్రధాని థెంబా మసుకు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కరోనాకు మెరుగైన చికిత్స నిమిత్తం డిసెంబర్‌ 1న ఆంబ్రోస్‌ను దక్షిణాఫ్రికాకు తరలించారు. అయితే పరిస్థితి విషమించి ఆదివారం అర్థరాత్రి మరణించారని అన్నారు. కాగా, అతిచిన్న దేశమైన ఎస్వాతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది. 2018లో ఆయన ఎస్వాతినీకి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది పోలాండులోని కటోవిస్‌ నగరంలో జరిగిన ప్రపంచ సదస్సులో వాతావరణ మార్పులపై ఆంబ్రోస్‌ ప్రసంగించారు. అంతకుముందు ఆయన బ్యాంకింగ్‌ రంగంలో పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments