Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 'ఉమ్మి'పై నిషేధం... సింగపూర్ తరహాలో అమలు

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:01 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే.. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, వీధుల్లో ఉమ్మి వేయడాన్ని సంపూర్ణంగా నిషేధించింది. పైగా, ఈ ఆదేశాలను సింగపూర్ తరహాలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. 
 
దేశాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. అలాగే, తెలంగాణా రాష్ట్రంలో కూడా అనేక కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ తరహా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధించింది. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాలు, సంస్థలు, కార్యాలయాలు, రోడ్లపై పాన్, తంబాకును నమిలి ఉమ్మివేయడం నిషేధం. 
 
ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మివేయడం, శుభ్రత లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉందని, అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రజారోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించినట్టు తెలిపారు.
 
బహిరంగప్రదేశాల్లో ఉమ్మివేయడం ద్వారా అంటువ్యాధులు వ్యాపించే తీవ్రమైన ముప్పు పొంచి ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలు తిరిగే ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రహదారుల మీద ఉమ్మివేసే వాహనదారులను ఆటోమెటిక్‌ వెహికిల్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఏవీఆర్‌ఎస్‌) ద్వారా గుర్తించి.. వారిపై చర్యలు తీసుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠినంగా వ్యవహరించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sukku: తన భార్యతో వింబుల్డన్ 2025 ఫైనల్స్‌కు హాజరయిన తబిత బండ్రెడ్డి

బిగ్ బాస్ 19లో క్రికెటర్ మాజీ భార్య.. హైదరాబాద్ నుంచి ఇద్దరు!!

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments