Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త సోదరుడితో అక్రమ సంబంధం, పెద్దలకు తెలియడంతో?

Advertiesment
భర్త సోదరుడితో అక్రమ సంబంధం, పెద్దలకు తెలియడంతో?
, మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (23:01 IST)
అక్రమ సంబంధాలతో కుటుంబాలు నాశనమై పోతున్నాయని తెలిసినా పరిస్ధితుల మూలంగానో, మరే ఇతర కారణాల  వలనో సమాజంలో ప్రతి ఒక్కరూ వీటిపై ఆకర్షితులవుతూనే ఉన్నారు. వాటి పర్యవసానాలకు బలవుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే జరిగింది. 16  ఏళ్లక్రితం భర్త సూసైడ్ చేసుకుని చనిపోవటంతో ఒంటరిగా ఉన్న మహిళ బావతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో బావ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఇవి చూసి తట్టుకోలేని ఆ మహిళ ఏప్రిల్ 4 శనివారం సూసైడ్ చేసుకుని కన్ను మూసింది.
 
చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బండ్లపాయి గ్రామంలో జ్యోతి అనే మహిళకు వాసు అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి 15,12 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో వాసు 2004లో ఆత్మహత్య  చేసుకున్నాడు. దీంతో జ్యోతి పిల్లలను పెట్టుకుని అదే గ్రామంలో ఊరి చివర ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో వాసు అన్నయ్య చంద్రశేఖర్ తమ్ముడి సంసారం గురించి అప్పుడప్పుడూ మంచిచెడులు కనుక్కుంటూ ఉండేవాడు. 
 
ఇలా తమ్ముడింటికి వచ్చిపోయే కాలంలో మరదలు జ్యోతి, బావ చంద్రశేఖర్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కాల క్రమంలో అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ కుటుంబం మంచిచెడులు చూడటానికి వస్తూ పోతూన్న చంద్రశేఖర్, జ్యోతిలు శారీరకంగా కలిశారు. 
 
భర్త పోయి ఒంటరితనంతో ఉన్న జ్యోతి, బావ శేఖర్‌తో రాసలీలలు కొనసాగిస్తూ వస్తోంది. ఇది చాలా కాలం గుట్టుగా సాగినా, కొంత కాలానికి విషయం బయటకు పొక్కింది. చంద్రశేఖర్ ఇంట్లో తెలిసి అతని భార్య, భర్తను నిలదీసింది. ఇక శేఖర్ కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. శేఖర్.. మరదలు జ్యోతితో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే విషయం వారి బంధువుల్లోనూ తెలిసిపోయింది.  
 
బంధువులందరూ జ్యోతిని మందలించటం మొదలెట్టారు. బంధువుల మాటలకు జ్యోతి మనోవేదనకు గురైంది. బంధువుల మాటలకు కలత చెందిన జ్యోతి నిన్నరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇది చూసిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లి ఆస్పత్రికి తరలించారు.
 
జ్యోతి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన డాక్టర్లు తిరుపతికి తీసుకువెళ్లాలని సూచించారు. తిరుపతి వెళ్తుండగా మార్గమధ్యంలోనే జ్యోతి ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. దీంతో ఆమె మృతదేహానికి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న చౌడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ కల్లోలం, భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు