Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడి కోసం భర్తను లారీతో ఢీకొట్టి చంపేసింది.. ఎక్కడ?

ప్రియుడి కోసం భర్తను లారీతో ఢీకొట్టి చంపేసింది.. ఎక్కడ?
, సోమవారం, 6 ఏప్రియల్ 2020 (15:55 IST)
ఆధునిక యుగం, స్మార్ట్ ఫోన్ల వాడకం కారణంగా అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దలు కుదిర్చిన వివాహమైనా అంతా మూడురోజుల ముచ్చటలా మారిపోయింది. ఆర్ధిక పరిస్థితుల రీత్యా భార్యా భర్తలు ఇద్దరూ కూడా కష్టపడి సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

డబ్బుల కోసం భర్త ఒక్కోసారి వేరే ఊర్లు, దేశాలు కూడా వెళ్ళి సంపాదించేది కూడా మనం చాలానే చూస్తున్నాం. అలాంటి సమయాల్లో భార్యలు కొంతమంది అక్రమ సంబంధాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే ఒకటి చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగలక్ష్మి, చిన్నరెడ్డెప్పల కుమారుడు బాలసుబ్రహ్మణ్యం(35)కు 11ఏళ్ల క్రితం ఇతను రేణుకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంతో ఆనందంగా అన్యోన్యంగా ఉండే ఈ జంట కొన్నాళ్లపాటు గిఫ్ట్‌ సెంటర్‌ నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారంలో అనుకోకుండా తీవ్రంగా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో అర్ధం కాని సమయంలో అతను రెండేళ్ల పాటు తిరుపతికి వెళ్లి అక్కడ ట్రావెల్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 
 
అయితే రేణుక మాత్రం ముగ్గురు పిల్లలతో కలిసి మదనపల్లెలోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఈమె ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కె.నాగిరెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భర్త ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహించిన భార్య ప్రియుడు నాగిరెడ్డిని వదల్లేక వాళ్ళ రాసలీలలకు అడ్డు వస్తున్న భర్తను హతమార్చాలని ప్లాన్ చేసింది. 
 
దాంతో నాగిరెడ్డిని ఎలాగైనా తన భర్తను చంపేయాలని ప్రియుడ్ని ఉసిగొలిపింది. దీంతో అతను ఓ సారి ఆరోగ్యం బాగోక ఇబ్బంది పడుతున్న సమయంలో ఊరిలోకి వెళ్ళి మాత్రలు తెచ్చుకోవాలని బాగా ఇబ్బంది పెట్టి మరీ బాలసుబ్రమణ్యం వద్దన్నా కూడా ఊరిలోకి పంపించింది రేణుక. అలా వెళ్లిన భర్తను లారీ డ్రైవర్‌తో సుపారీ మాట్లాడి అటుగా వస్తున్న అతనిని ఢీకొనేలా చేసింది. 
 
లారీ ఢీకొట్టిన ఘటనలోగుద్ది అక్కడికక్కడే చనిపోయేలా చేశారు. దీంతో సుబ్రమణ్యం తమ్ముడు అనుమానం లాయర్ అయిన కె.రఘుపతి ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా అసలు నిజాలు బయట పడ్డాయి. దాంతో హత్యకు పాల్పడ్డవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మరో నెల పాటు వర్క్ ఫ్రమ్ హోం సేవలు?? మేలో రెండో దశ లాక్‌డౌన్??