Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్త చైన్‌స్నాచర్ ... భార్య అడ్డదార్లు ... ప్రియుడితో కలిసి...

Advertiesment
Nalgonda
, శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (14:44 IST)
ఓ వివాహిత కట్టుకున్న భర్తను తన ప్రియుడుతో కలిసి హతమార్చింది. మృతుడు చైన్‌స్నాచర్. దీంతో అడ్డదార్లు తొక్కిన ఆ వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తమ వివాహేతర బంధం సాఫీగా సాగిపోయేందుకు భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది. ప్రస్తుతం ప్రియుడితో కలిసి భార్య కూడా జైలు ఊచలు లెక్కిస్తోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారం వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తికి పానగల్‌కు చెందిన చాపల స్రవంతి అనే మహిళతో 13 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 
 
అయితే, జల్సాలకు అలవాటుపడిన వెంకట్ రెడ్డి.. చైనా‌స్నాచింగ్‌లతో పాటు.. చోరీలకు పాల్పడుతూ వచ్చాడు. వివాహం తర్వాత కూడా వెంకట్ రెడ్డి బుద్ధిమారలేదు. దీంతో వివిధ ప్రాంతాల్లో సుమారుగా 40పైగా కేసులు నమోదయ్యాయి. 
 
అదేసమయంలో భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో పానగల్‌కు చెందిన మున్నా శేఖర్ అనే వ్యక్తితో స్రవంతికి వివాహం కాకముందు నుంచే మాట పరిచయం ఉండేది. ఈ మాట పరిచయం కాస్త వివాహేతర సంబంధానికిదారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు మొదలయ్యాయి. 
 
ఈ క్రమంలో భర్త వెంకట్‌ రెడ్డిని ఎలాగైనా అడ్డుతొలగించి స్రవంతిని పెళ్లి చేసుకోవాలని శేఖర్‌ పథకం వేశాడు. ఈ నెల 26న వెంకట్‌రెడ్డి ఓ డీసీఎం వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరిన విషయం శేఖర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన స్నేహితులను తీసుకుని మర్రిగూడ స్టేజీ వద్ద డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడ నుంచి వెంకట్ రెడ్డిని కారులో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, కత్తితో పొడిచి చంపేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారం తెలియడంతో హత్యా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో మృతుని మొబైల్ డేటా ఆధారంగా అసలు నిందితులైన శేఖర్, మృతుని భార్య స్రవంతి, శేఖర్ స్నేహితులు చింటు, దుంపల సాయికుమార్‌లను పోలీసులు అరెస్టు చేసి, కటకటాలవెనక్కి పంపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిఎం సారూ, హస్మద్ షూట్ ఎక్కడ? అది లేకుంటే వైద్యులకు కరోనా ఖాయం?