భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. దేశంలో 211 రాష్ట్రాలు వైరస్ బారినపడి అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై కూడా కరోనా కోరలు చాస్తోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 329 కాగా, తెలంగాణలో 404కు చేరింది.
నెల్లూరులో 6, కృష్ణా 6, చిత్తూరు జిల్లాల్లో 3 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కర్నూలులో 74 కేసులు నమోదయినట్టు తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందగా ఆరుగురు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలోని మొత్తం కేసుల్లో సగానికి పైగా కర్నూలు.. నెల్లూరు, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో టెన్షన్ నెలకొంది. ఏపీ సర్కార్ కరోనా పరీక్షా కేంద్రాల సామర్ధ్యం పెంచింది. ప్రాథమిక స్థాయిలోనూ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అధికారులు రెడ్‌జోన్లను క్లస్టర్లుగా విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇటు తెలంగాణలోనూ గత 24 గంటలలో మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 404కి చేరింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 154 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 11 మంది మృతి చెందారు.