Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటికి చేరువలో కరోనా కేసులు.. అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా బిజీ.. కోవిడ్ వ్యాప్తి

Webdunia
గురువారం, 25 జూన్ 2020 (12:23 IST)
కరోనా మహమ్మారితో ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 95 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95,27,125 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,84,972 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 51,75,406 మంది కోలుకున్నారు. ఫలితంగా కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా కోటి దగ్గరలో నమోదవుతున్నాయి. 
 
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అధ్యక్ష ఎన్నికల హడావిడిలో ఉన్న అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 24,62,554 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,24,281 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,40,605 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదైన అమెరికా, బ్రెజిల్‌లో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. 
 
అమెరికాలో బుధవారం ఒక్కరోజే 39 వేల కొత్తకేసులు నమోదవగా, బ్రెజిల్‌లో 41 వేల కేసులు రికార్డయ్యాయి. అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో తాజాగా 41వేల పైచిలుకు కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,474కు చేరింది. దేశంలో ఇప్పటివరకు ఈ వైరస్‌ వల్ల 53,874 మంది మరణించగా, 4,88,692 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 6,06,881 పాజిటివ్‌ కేసులతో రష్యా మూడోస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఈవైరస్‌ వల్ల ఇప్పటివరకు 8513 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments