బ్రిటన్‌లో కరోనా విశ్వరూపం

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (11:45 IST)
బ్రిటన్‌లో కరోనా విశ్వరూపం చూపుతోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, వృద్ధుల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, మృతుల సంఖ్య పెరగడం.. వైద్యవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. 
 
మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఇవన్నీ కలిసి కరోనా వ్యాప్తికి ఊతం ఇచ్చాయి. రెండు వారాలుగా 35 నుంచి 40 వేల మధ్య నమోదైన రోజువారీ కేసులు.. సోమవారం 50 వేలకు చేరువయ్యాయి. వేసవికాలం నుంచి తరచుగా రోజుకు 100కు పైగా మరణాలు వెలుగుచూస్తున్నాయి. మొత్తం మరణాల సంఖ్య లక్షా 38 వేలకు చేరింది.
 
ఇతర దేశాలతో పోల్చితే బ్రిటన్‌లో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉంది. పాజిటివ్‌ కేసులు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో నమోదవుతోన్న కరోనా కేసులే ప్రస్తుత ఉద్ధృతికి దోహదం చేస్తున్నాయని రీడింగ్‌ యూనివర్సిటీకి చెందిన నిపుణుడు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments