Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో 45వేలకు చేరిన కరోనా మృతుల సంఖ్య.. దేశంలోనూ..?

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (21:14 IST)
మహారాష్ట్రలో కరోనా మృతుల సంఖ్య 45వేలు దాటింది. వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ ప్రతి రోజు వేలల్లో కరోనా కేసులు, వందల్లో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 3,959 పాజిటివ్‌ కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,14,273కు, మరణాల సంఖ్య 45,115కు పెరిగింది.
 
మరోవైపు గత 24 గంటల్లో 6,748 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,69,090కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 99,151 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతుంది.
 
దేశంలో కరోనా కేసులతో పాటు, మృతుల సంఖ్య కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 577 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో 1,25,562 మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 50,357 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 84,62,081కు చేరింది. గడిచిన 24 గంటల్లో 53,920 కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 78,19,887 కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

తర్వాతి కథనం
Show comments