Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీలో 6వేలకు తగ్గట్లేదు..

Advertiesment
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీలో 6వేలకు తగ్గట్లేదు..
, శనివారం, 7 నవంబరు 2020 (10:25 IST)
భారత దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 50,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. ఇందులో 78,19,887 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,16,632 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో 577 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,25,562కి చేరింది. 
 
24 గంటల్లో 53,920 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం రోజున 47 వేల కేసులు నమోదు కాగా, శనివారం 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ థర్డ్‌ వేవ్ కొనసాగుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం కూడా పాజిటివ్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 7,178 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో కరోనా వ్యాపించినప్పటి నుంచి అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
గత మూడు రోజుల నుంచి 6 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నవంబర్ 4వ తేదీన 6,842 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్‌తో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4,23,831కి చేరగా, రికవరీ రేటు 89 శాతంగా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ-49 వాహక నౌక కౌంట్‌డౌన్‌ ప్రారంభం