తుపాకీలను భయపెడుతున్న కరోనావైరస్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (21:32 IST)
బాజిరెడ్డి... గన్ చూడాలనుకో తప్పులేదు.. బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్.. ఇది అతడు సినిమాలో మహేష్ బాబు కోటా శ్రీనివాస్ రావుకు ఇచ్చే స్మార్ట్ వార్నింగ్.. మూడు అంగుళాల బుల్లెట్ ఎంత పవర్‌పుల్లో తెలుసుకదా మరి తూటాను విడుదల చేసే తుపాకికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. మరి అటువంటిది అది పోలీస్‌లు వాడే తుపాకీ అయితే ఇంకా చెప్పాలా.. మరి అటువంటి తుపాకీ కూడా కరోనావైరస్ భయం పట్టుకుంది.
 
మనుషులకే కాదు.. ఆయుధాలను కూడా కరోనా భయం వెంటాడుతుందంట. అందువల్ల ఆ తుపాకులు కూడా ఇప్పుడు శానిటైజ్ చేసుకోవాల్సి వస్తోంది. మరి అంత భద్రత చేయకపోతే మన ప్రాణాల మీదకే ముప్పు ఏర్పడుతుంది. అందువల్లనే తుపాకులను సైతం శానిటైజ్ చేస్తున్నారు భద్రాద్రి జిల్లా పోలీసులు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే చాలు బతికి బయట పడుతామన్న నమ్మకం లేదు.
 
విషయం ఏంటంటే ఛత్తీస్‌ఘడ్, తెలంగాణా సరిహద్దు జిల్లాల ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కనిపించడంతో గాలింపు చర్యలు ఉదృతం చేశారు ఇరు రాష్ట్రాల పోలీసులు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన సి.ఆర్.పి.ఎఫ్ జవానులకు కరోనా సోకింది. చర్ల సరిహద్దులో ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ ప్లాటూన్ అరవై మందికి పైగా కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలండంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు.
 
వీరితో కలిసి తెలంగాణ పోలీసులు కూడా కూంబింగ్‌లో పాల్గొనడంతో తెలంగాణకు చెందిన ఇరవై మందిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో 
కూంబింగ్‌లో వాడిన ఆయుధాలతో పాటు, పోలీసులు మోసుకు వచ్చిన తుపాకులను కూడా హెడ్ క్వార్టర్లో శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఎవ్వరికైనా కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ అంటుకుంటే వారి వల్ల తుపాకులకు కూడా అంటుకుంటుంది.
 
ఇనుము మీద కరోనావైరస్ ఎక్కువసేపు ఉంటుందని ఇప్పటికే వైద్య అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ తుపాకులను మళ్లీ మరో బృందానికి ఇచ్చి కూంబింగ్‌కు పంపింస్తారు. అందువల్ల ముందు జాగ్రత్తగా తుపాకులకు కూడ శానిటైజ్ చేస్తున్నారు అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ అందరి ఊహలకు అందని చిత్రంగా 'రాకా' : సన్ పిక్చర్స్

ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ : పవన్ కళ్యాణ్ సతీమణి

Raaka: అల్లు అర్జున్ #AA22xA6 ఫస్ట్-లుక్ టైటిల్ ఇదే

Venkatesh: ఐదు సినిమాలు చేస్తే చాలనుకున్న నన్ను నిలబెట్టింది వారే : అడివి శేష్

Akhil: అఖిల్ అక్కినేని పుట్టినరోజున లెనిన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments