Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర దర్శకుడు బందూక్ లక్ష్మణ్ అరుదైన కానుక

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (21:22 IST)
పుట్టినరోజు ప్రతీ ఒక్కరికీ ప్రత్యేకమైనది, అందునా తనువు, మనసు, ఆత్మంతా తెలంగాణే నిండిన కేటీఆర్ బర్త్ డే అంటే యావత్ తెలంగాణ ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. సినిమాపై అంతులేని ప్రేమతో తొలిసారిగా ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్ తెలంగాణావాళ్లతో బందూక్ చిత్రాన్ని రూపొందించిన లక్ష్మణ్, కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అరుదైన కానుకని రూపొందించినట్టు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
 
కేటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన వివిద కరెన్సీ నోట్లని గత రెండు సంవత్సరాలుగా సేకరించి ఈ 2020 జూలై 24న కేటీఆర్ 44వ పుట్టినరోజున అందజేస్తున్నట్టు తెలిపారు. రూపాయి నోటు, ఐదురూపాయల నోటు, పదిరూపాయలనోటు, ఇరవై రూపాయల నోటు, యాభై రూపాయల నోటు, వంద రూపాయలు అలాగే రెండువందల రూపాయల నోట్ల వరకూ 24.07.76 ఒకే నంబర్ గల నోట్లని సేకరించారు.
 
దీంతో పాటు కేటీఆర్ చింతమడకలో బుడిబుడి అడుగులు వేసింది మొదలు నేటి యువనాయకుడుగా ప్రపంచస్థాయిలో ఎదిగే వరకూ ప్రతీ మధురమైన క్షణాన్ని పోటోల రూపంలో సేకరించి, వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాగ్రౌండ్తో అందమైన పోటో ఫ్రేముగా రూపొందించి వాటిలో 240776 అంకె కలిగిన కరెన్సీ నోట్లని పొందుపరిచిన తీరు కేటీఆర్ అభిమానులని అలరిస్తుంది.
 
ఎన్నో ప్రయాసలకి ఓర్చి సేకరించిన ఈ అరుదైన కానుకని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నందుకు బందూక్ లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తిపై ఎంతటి ప్రేమ ఉంటే ఇంతటి ఓర్పుతో సేకరణ చేయగలరో ఊహించుకుంటూనే బందూక్ లక్ష్మణ్ మనసు తెలిసిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

Parthiban : నటి సీత నాకు లైఫ్ ఇచ్చిందంటున్న పార్తీబన్, తెలుగులో రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments