కరోనా వైరస్ సోకిన పురుషుల్లో అంగస్తంభన సమస్య???

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (07:56 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిస్తున్నారు. ముఖ్యంగా, అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధులు, చిన్నారులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే తాజాగా ఓ విస్తుగొలిపే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ బారినపడిన పురుషుల్లో అంగస్తంభన సమస్య తలెత్తుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
కరోనా వైరస్ సోకి, దాని నుంచి బయటడిన వారికి దీర్ఘకాలిక కాలిక సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, పురుషులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలిపారు.
 
నిజానికి గతంతో పోలిస్తే ఇప్పుడు కరోనా చికిత్స మెరుగైంది. వ్యాక్సిన్ కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ వైరస్ సంబంధిత సమస్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 
 
ప్రధానంగా పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల కరోనాకు పూర్తిస్థాయిలో టీకా వచ్చే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరై కాడిపడేయొద్దని వైద్యులు కోరుతున్నారు.
 
'కరోనా వైరస్ రక్తనాళ వ్యవస్థలో సమస్యలకు కారణమవుతుందని మాకు తెలుసు. ఫలితంగా పురుషుల్లో దీర్ఘకాలిక అంగస్తంభన సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది నిజంగా ఆందోళన చెందాల్సిన విషయం. వైరస్ మనల్ని చంపడమే కాదు, వాస్తవానికి దీర్ఘకాలిక, జీవితకాల, సంభావ్య, సమస్యలకు కారణమవుతుంది' అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాస్తవ ఘటన ఆధారంగా అభినయ కృష్ణ కామాఖ్య చిత్రం

కొడుకు వల్ల బిక్షాటన చేస్తున్న పెద్దాయన కథ ఆదారంగా దూరదర్శిని చిత్రం

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం ఆలస్యానికి కారణం అదే అన్న నిర్మాత

Bhavana: రేప్ మర్డర్ నేపద్యం గా భావన నటించిన డాక్టర్ కీర్తి ఎంబీబీఎస్ ఎంఎస్ తెలుగులో సిద్ధం

Manjula: అగధ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

ఆరోగ్యకరమైన పనితీరుకు ఎర్గోనామిక్స్ కీలకం: ప్రముఖ ఎర్గోనామిక్స్ నిపుణుడు మను నెల్లుట్లచే నాట్స్ వెబినార్

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

విశాఖపట్నంలో ఫరెవర్ న్యూ మొదటి స్టోర్ ప్రారంభం

హైదరాబాద్‌లో బ్రాండ్ బొటిక్‌ను ప్రారంభించిన లాంజీన్స్ ఫ్రెండ్ ఆఫ్ ది బ్రాండ్ సారా అలీ ఖాన్

తర్వాతి కథనం
Show comments