Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా వైరస్ దీవెనలు నాకు ఉన్నాయి: రామ్‌గోపాల్ వర్మ

Advertiesment
కరోనా వైరస్ దీవెనలు నాకు ఉన్నాయి: రామ్‌గోపాల్ వర్మ
, శనివారం, 5 డిశెంబరు 2020 (16:43 IST)
ఏ విషయాన్ని ఎప్పుడు ఎలా చెప్పాలో, ఏ సందర్భాన్నైనా పబ్లిసిటీకి ఎలా వాడుకోవాలో కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మకి తెలిసినంతగా మరెవరికీ తెలియదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి అందరూ బయపడితే, ఆయన‌ ఏకంగా సినిమానే తీశారు. లాక్‌డౌన్ సమయంలో సినిమా షూటింగులకు బ్రేక్ పడినా రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
 
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కొన్ని సినిమాలు తెరకెక్కించి ఓటీటీ ద్వారా రిలీజ్ చేశారు. తాజాగా కరోనా మహమ్మారినే కథగా చేసుకుని ఆర్జీవీ కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని మాత్రం థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో సినిమా థియేటర్ల ప్రారంభం తరవాత వర్మ చిత్రమే తొలి డైరెక్ట్‌ మూవీగా విడుదల అవుతుంది. కరోనా సమయంలో ఇంట్లోనే ఇరుక్కుపోయిన ఓ కుటుంబంలో జరిగే ఘటనలే ఈ సినిమ ఇతివృత్తం. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌కు డైరెక్టర్‌ అగస్త్య మంజు. డిసెంబర్‌ 11వ తేదీన కరోనా వైరస్‌ మూవీ థియేటర్లలో విడుదల అవుతుందని వర్మ తెలిపారు. ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన కరోనా వైరస్ చిత్ర  ప్రెస్ మీట్లో వర్మ పాల్గొన్నారు.
 
రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... ‌నన్ను నమ్మి ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ధన్యవాదాలు. లాక్ డౌన్ టైమ్‌లో హీరోలు, దర్శకులు అంట్లు తోముకుంటూ, వంటలు వండుకుంటూ, ఇళ్లు ఊడ్చుకుంటూ టైమ్ పాస్ చెస్తే, తాము మాత్రం సినిమాలు తీశామని, కరోనా వైరస్ దీవెనలు తమకు ఉన్నాయని, దాని వలనే ఎవరు కరోనా వైరస్ భారిన పడకుండా కరోనా వైరస్ సినిమాను తీయగలిగామని, కరోనా వైరస్‌కు తాను బుణపడి ఉన్నానన్నారు.
 
కరోనా వల్ల ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్న సమయంలో, వర్మ నుంచి పిలుపు రావటం, ఈ సినిమాను చేయటం జరిగిందని, ఓ కుటుంబంలా ఒకే చోట ఉంటూ ఈ కుటుంబ కధా చిత్రంలో నటించామని నటీనటులు శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ చాగంటి, సోనియా ఆకుల తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత నట్టికుమార్, దర్శకుడు అగస్త్య మంజు తదితరులు పాల్గొన్నారు.
 
శ్రీకాంత్ అయ్యంగార్, వంశీ చాగంటి, కల్పలత గార్లపాటి, సోనియా ఆకుల, దక్షీ గుత్తికొండ, దొరసాయి తేజ, ప్రమీల, సంగీత తదితరులు నటించిన ఈ చిత్రానికి పిఆర్ఓ : మధు వి.ఆర్ , ఆర్ట్ : మధుకర్, కూర్పు : నాగేంద్ర, రచన: కల్యణ్ రాఘవ్, సంగీతం: డిఎస్ఆర్, సినిమాటోగ్రఫీ: మల్హర్ బట్ కోడి, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్: కృష్ణ, దర్శకత్వం: అగస్త్య మంజు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ‌య‌ల‌లిత వ‌ర్ధంతి సంద‌ర్భంగా 'త‌లైవి' వ‌ర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన కంగ‌నా ర‌నౌత్‌